![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -701 లో.... జ్యోత్స్నని సూరజ్ పాలు తీసుకొని రమ్మని చెప్తాడు. దాంతో జ్యోత్స్న పాలు తీసుకొని వస్తుంది. మన ఇద్దరికి గొడవ ఎందుకు.. ఆ దీప వల్ల నీకేం రాదు నాతో చెయ్ కలుపు అని జ్యోత్స్న అనగానే బాగుంది డీలింగ్ అని సూరజ్ అంటాడు. అయితే నాతో చెయ్ కలిపినాట్లేనా అని జ్యోత్స్న అంటుంది. అవునని సూరజ్ అనగానే నిన్ను ఎలా నమ్మేది అని జ్యోత్స్న అడుగుతుంది. అయితే నా ఫోన్ తీసుకొని నీకు సంబంధించినవన్ని డిలీట్ చేసుకోమని సూరజ్ అనగానే సూరజ్ ఫోన్ తీసుకొని జ్యోత్స్న అన్నీ డిలీట్ చేస్తుంది.
ఇక అన్నీ చేసాను నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చెయ్యలేవని జ్యోత్స్న పొగరుగా మాట్లాడుతుంటే ఒకసారి అటు చూడమని వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం సూరజ్ దూరంగా వేరే ఫోన్ తో రికార్డింగ్ చేస్తాడు. ఇంత మోసం చేస్తావా అని జ్యోత్స్న అంటుంది. ఇదే కాదు నీకు సంబంధించిన అన్ని వీడియోస్ నా దగ్గర భద్రంగా ఉన్నాయని సూరజ్ అంటాడు. దాంతో జ్యోత్స్న కోపంగా బయటకు వెళ్లి రేపు ఫుడ్ డెలివరీ ఎలా చేస్తావో చూస్తానని తన గదికి తాళం వేస్తుంది. మరొకవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటారు. గడువులోపు జ్యోత్స్నకి పెళ్లి చెయ్యాలని దీప అంటుంది. దానికి దానికన్నా తిక్కలోడు దొరకాలని కార్తీక్ అంటాడు.ఆ తర్వాత దశరథ్ దగ్గరికి పారిజాతం వచ్చి జ్యోత్స్నకి ఇచ్చిన రెస్టారెంట్ ఎలా ఉందని అడుగుతుంది. లాభాల్లోకి వచ్చిందని దశరథ్ చెప్తాడు. అది ఫారెన్ లో చదువుకున్న పిల్ల.. అది ఫాస్ట్ గా డెవలప్ చేస్తుందని పారిజాతం అంటుంది. మరి ఆ దీప రెస్టారెంట్ ఎలా ఉందని పారిజాతం అడుగగా.. కొంచెం పర్వాలేదని దశరథ్ అంటాడు.
మరొకవైపు దీప తన ఆర్డర్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఫుడ్ కాంచన టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తుంది. దీప, కాంచన సరదాగా మాట్లాడకుంటారు. మరొకవైపు సూరజ్ రూమ్ కి జ్యోత్స్న వచ్చి తాళం ఉన్న రూమ్ ని చూస్తుంది. అప్పుడే సూరజ్ వీడియో కాల్ చేసి హాయ్ జ్యోత్స్న ఆల్రెడీ ఫుడ్ డెలివరి చేస్తున్నాం చూడమని చూపిస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు ఎలా చేస్తారో నేను చూస్తానని జ్యోత్స్న అనుకుటుంది. సూరజ్ ఫుడ్ తీసుకొని ఒక అడ్రెస్ కి వెళ్తాడు అక్కడ వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేయలేదని చెప్తారు. దాంతో సూరజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |